Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మెనూ ప్రకారం భోజనం అందించాలి..

మెనూ ప్రకారం భోజనం అందించాలి..

- Advertisement -

13న తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి…
జిల్లా షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి శ్యాంసుందర్….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం తప్పనిసరిగా అందించాలని, ఈనెల 13వ తేదీన హాస్టల్లో వసతి గృహాలలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి శ్యాంసుందర్  కోరారు. మంగళవారం ఆయన జిల్లా షెడ్యూల్ క్రమంలో అభివృద్ధి అధికారి కార్యాలయంలో శాఖ అధికారులు వసతి గృహ సంక్షేమ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి,  సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి అధికారి హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఈనెల 13న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలలో పిల్లల ప్రగతిని, ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి వసతుల గురించి, పిల్లల యొక్క సమస్యలను తెలుసుకొనుటకు సమావేశం నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad