Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి: కలెక్టర్

మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
ప్రతి రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం  భువనగిరి పట్టణంలోని కేజీబీవీ స్కూల్,కాలేజీ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. మెనూ ప్రకారం  విద్యార్థులకి వంట చేసిన కర్రీస్ ను,భోజనాన్ని పరిశీలించారు. 

మెనూ ప్రకారం  టమాట, గుడ్డు కర్రీ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని ఎస్ఓ ని అడిగితే గుడ్లు టెండర్ తీసుకున్న వ్యక్తి సరఫరా చేయడం లేదని తెలిపారు.వెంటనే సంబధిత టెండర్ దారుడితో కలెక్టర్ ఫోన్ లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో గుడ్లు సరఫరా చేయిస్తా అని సంబంధిత వ్యక్తి చెప్పడం జరిగింది. వంట గది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ  మంచిగాచదువుకుంటున్నారా, టీచర్లు విద్యాబోధన అర్థమయ్యేలా చెప్తున్నారా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. ప్రతిరోజు భోజనం  ఎలా  ఉందని అడిగతెలుసుకున్నారు.

స్కూల్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు స్కూల్ లో ఏమైనా సమస్యలు ఉన్నయా అని విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు  సమస్యలు ఏమి లేవని,  సార్ ఈ స్కూల్ బాగుందని, మా పిల్లలకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తున్నారని  స్టడీ కూడా బాగుంది అని తెలిపారు. మీ తల్లిదండ్రులు మీ పై ఎన్నో ఆశలతో స్కూల్, కాలేజీలకు పంపిస్తున్నారని మీరు ఉన్నత స్థానంలో ఉంటే  సంతోషపడతారని అన్నారు. మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad