Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈగల నివారణకు చర్యలు తీసుకోవాలి..

ఈగల నివారణకు చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

నోటీసులు ఇచ్చిన సర్పంచ్ లు..
నవతెలంగాణ – నవాబు పేట
మండలం పరిధిలోని ఇప్పటూర్ సమీపంలో వున్నా కొల్లాఫామ్ వల్ల ఈగలు ఇళ్లలోకి వస్తున్నాయని ఇప్పటూర్, చెన్నారెడ్డి పల్లి, మల్లారెడ్డి పల్లి గ్రామాల సర్పంచ్ లు రవి కిరణ్, నవనీత,తోట రాములు గ్రామ కార్యదర్శులతో కలిసి కోళ్ల ఫామ్ ల యాజమాన్యం , సిబ్బంది కి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం సకాలంలో స్పందించి ఈగల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కోళ్ల ఫామ్ సిబ్బంది కేశవులు మాట్లాడుతూ మూడు గ్రామాల్లో ఈగల నివారణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ లు రవి కిరణ్, నవనీత, తోట రాములు, రైతులు మైబు, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -