– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, అధిక వర్షాల వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తన చాంబర్లో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇండ్లు, వనమహోత్సవంలో ప్లాంటేషన్ పై సమీక్షించారు.కార్బన్ క్రెడిట్ గ్రామసభలు, ఫిట్టింగ్ ప్లాంటింగ్ పూర్తి చేయడం, ఎలక్షన్స్ మెర్జింగ్ స్టేట్మెంట్స్ పూర్తి చేయడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే, ఇందిరమ్మ ఇండ్ల బ్యాలెన్స్ ఉన్న వాటిని ముగ్గులు పోయడం, ముగ్గులు పోసిన వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్ సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్య సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.