Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు వ్యాధి నివారణకై చర్యలు

గాలికుంటు వ్యాధి నివారణకై చర్యలు

- Advertisement -

చెన్నూరు పశువైద్యాధికారి రమ్య 
నవతెలంగాణ – పాలకుర్తి

పశువులకు, పాడి గేదెలకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకై రైతులకు అవగాహన కల్పిస్తూ చర్యలు చేపడుతున్నామని చెన్నూరు పశు వైద్యాధికారి రమ్య తెలిపారు. శనివారం మండలంలోని తీగారంలో పశు గణాభివృద్ధి శాఖ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి రమ్య మాట్లాడుతూ ..వ్యాధుల భారీ నుండి పశువులను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులకు, సినిమా పాడి గేదెలకు గాలికుంటు వ్యాధులతోపాటు ఎలాంటి వ్యాధులు సంభవించిన అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారితో పాటు హలో గోపాల మిత్రులను సంప్రదించాలని సూచించారు. ఉచిత పశు వైద్య శిబిరంలో 180 పశువులకు, పాడే గేదెలకు వైద్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేశామని, అందజేశామని తెలిపారు. ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకొని సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పశువైద్యాధికారి బి శివప్రసాద్, గోపాలమిత్ర రాగిరి సమ్మయ్య, రైతులు, ఐలేష్, మొగిలి, సంధ్య, అనిత, ఆంజనేయులు పాల్గొన్నారు . 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -