నవతెలంగాణ – మద్నూర్
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సబ్సిడీ పైన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందుబాటులో ఉన్నట్లు వీటిని సబ్సిడీలతో వ్యవసాయ రైతులు పొంది సద్వినియోగం పంచుకోవాలని ఏఈఓ సౌమ్య ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఎస్సీ రైతు లకు 50% సబ్సిడీ,మిగిలిన రైతులకి 40% సబ్సిడీ ద్వారా యాంత్రికరణ పనిముట్లు పొందవచ్చని సబ్సిడీపై పొందే పనిముట్లకుతీసుకోవాలనుకున్న రైతులు అప్లికేషన్ ఫారం నింపాలి. అనంతరం ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ జత చేసి ఇవ్వాలి.
ట్రాక్టర్ కి సంబంధించిన పనిముట్లు కావలసిన వారు ..
అప్లికేషన్ ఫారం, ట్రాక్టర్ R C, ఆధార్ జిరాక్స్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ జత చేసి శనివారం వరకు సంబంధిత ఏ ఈ ఓ లేదా మద్నూర్ మండల రైతు వేదికలో అందించాలి. డిడి లు కట్టాలనుకున్న వారికి సోమవారం తరువాత రేట్స్ తెలియజేయడం జరుగుతుందని ఆమె రైతులకు సూచించారు.