- Advertisement -
యూఎస్‌ఏ గ్రాండ్ నేషనల్స్
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఆగస్తి చంద్రశేఖర్ (16) యూఎస్‌ఏ గ్రాండ్ నేషనల్స్‌లో సత్తా చాటాడు. బీఎంఎక్స్ రేసింగ్ (సైక్లింగ్) అండర్-16 విభాగంలో పోటీపడిన చంద్రశేఖర్ నాల్గో స్థానంలో నిలిచాడు. 2023 తర్వాత బీఎంక్స్ రేసింగ్‌లో అంతర్జాతీయ స్థాయి మెడల్ సాధించిన తొలి భారత రైడర్‌గా చంద్రశేఖర్ నిలిచాడు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి పతకం సాధించటం ఎంతో గర్వంగా ఉందని’ చంద్రశేఖర్ అన్నాడు.
- Advertisement -



