Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుది దశకు మేడారం ఏర్పాట్లు

తుది దశకు మేడారం ఏర్పాట్లు

- Advertisement -

మూడు కోట్ల మంది సందర్శించనున్నట్టు అంచనా : మంత్రి సీతక్క

నవతెలంగాణ-మంగపేట/తాడ్వాయి
ఈ నెల 28 నుంచి 31వరకు జరగనున్న మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైనట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. తల్లుల దర్శనానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని సెక్టార్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతర ప్రారంభం కాకముందే ముందస్తు మొక్కులు చెల్లించుకున్న వారు కాకుండానే జాతర తేదీల్లో సుమారు మూడు కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత జాతరలో పని చేసిన అనుభవం ఉన్న అధికారులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా మేడారానికి రప్పించి వారి సేవలను వినియోగిస్తున్నారు. అధికారులు, సిబ్బందితోపాటు ఆదివాసీ యువతను సైతం మేడారంలో సేవలందించేందుకు ఉపయోగించనున్నట్టు మంత్రి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -