- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడారం మహాజాతరకు సెలవులు ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న మహాజాతరకు రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సమేతంగా భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర కావడంతో హాలిడేస్ ప్రకటించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇవాళో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -



