అనారోగ్యంతో తల్లి ఎల్లమ్మ మృతి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతాపం
శోకసముద్రంలో ఆదివాసి గ్రామం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ తల్లి ఎల్లమ్మ(65) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మండలంలోని కొండపర్తి గ్రామం తన కొడుకు లచ్చు పటేల్ నివాసంలో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎల్లమ్మ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లు దేవేందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు, సీతక్క యువసేన అధ్యక్షులు చర్ప రవీందర్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటి, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నివాళులర్పించారు. ఇదే రోజు బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఎల్లమ్మ చాలా మంచివారుగా గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆమె మరణ వార్త విన్న మండలంలోని గ్రామాల ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.
మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ కు మాతృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES