Saturday, July 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాసర ఆర్జీయూకేటీలో మీడియాకు కట్టడి...   

బాసర ఆర్జీయూకేటీలో మీడియాకు కట్టడి…   

- Advertisement -
  • – విధ్యార్థుల సెలక్షన్ లిస్ట్ విడుదల రోజు తప్పని ఆంక్షలు..‌!                   
    నవతెలంగాణ -ముధోల్
    బాసర ఆర్జీయూకేటిలో  మళ్ళీ మీడియాకు ఆంక్షలు తప్పటం లేదు.  సంబంధిత అధికారులు అవలంబిస్తున్న వైఖరి పై జర్నలిస్టులు  మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లో వేళితే.. బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటిలో విద్యను అభ్యసించడానికి విద్యార్థుల ప్రవేశ జాబితా ను శుక్రవారం బాసర యూనివర్సిటీ లో విసి గోవర్థన్ విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జర్నలిస్టు లకు యూనివర్సిటీ నుండి ఆహ్వానం పంపారు. దీంతో జర్నలిస్టులు  యూనివర్సిటీ మొయిన్ గేట్ దగ్గర  నుండి అనుమతి తీసుకోని క్యాంపస్ లోపల ఉన్న పరిపాలన భవనం వరకు తమ వాహనాల్లో వెళ్తుండగా, యూనివర్సిటీ  డిఎస్పీ రాజేష్ తన వాహనంలో అక్కడి వరకు రావటం జర్నలిస్టులకు ఆశ్చర్యానికి గురి చేసింది. 
  • యూనివర్సిటీ లో నిత్యం సమస్యలు రాజ్యం మేలుతుంటే  కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న వీసిని మార్చి  నూతన విసి గోవర్ధన్ నియమించినప్పటికీ మీడియా పై ఆంక్షలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు . విద్యార్థుల  ప్రవేశ జాబితా విడుదల చేయడానికి మీడియా అవసరం ఉండటంతో క్యాంపస్ లోపలికి జర్నలిస్టులను అనుమతించారు‌. అయితే విలేకరుల సమావేశం నిర్వహించే క్యాంపస్ లోపల ఉన్న పరిపాలన భవనం వరకు జర్నలిస్టులను రానిచ్చారు‌. మిగతా చోట్లకు వెళ్లకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ని కాపలా ఉంచారు.
  • ఒకపక్క మీడియాను  ఆహ్వానించి అవమానించడంపై జర్నలిస్టులు  అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ లో జరుగుతున్న అవకతవకలు, సమస్యలు బయటకు రాకుండా మీడియాను కట్టడి చేస్తున్నారని పలువురు జర్నలిస్టు లు  ఆరోపిస్తున్నారు‌. ఈ విషయం పై  విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత యూనివర్సిటీ డిఎస్పీ రాజేష్ ను విలేకరులు ప్రశ్నించగా పేన్నుకు , నొటికి ఆంక్షలు లేవు కదా అని సమాధానంను దాట వేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -