Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

- Advertisement -

– శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్, ఐకేపీ డీపీఎం సుదం వెంకటేష్
– శిబిరంలో 243 మందికి వైద్య పరీక్షలు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వందరోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు  వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ తెలిపారు.

ఈ వైద్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి ప్రియ, పిల్లల వైద్యులు డాక్టర్ శరత్, కంటి వైద్యులు డాక్టర్ సంకీర్తన, ఆర్థోపెడిక్ డాక్టర్ శుభం, డెంటల్ డాక్టర్ ప్రవీణ్, జనరల్ వైద్యులు డాక్టర్ మోసిన్ పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు  243 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 27 మందికి రక్త పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలున్న 34 మందిని నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. అంతకుముందు ఏ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్  మహబూబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఐకేపీ డీపీఎం సుదం వెంకటేష్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం కిరణ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తీర్ణ అధికారి సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకులు  స్వరూప, పద్మ, పవన్, రాంబాబు, మధు, వినీత్, వైద్య సిబ్బంది, సీసీ భాగ్యలక్ష్మి, పీర్య, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -