Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరెపల్లిలో వైద్యశిబిరం

ఆరెపల్లిలో వైద్యశిబిరం

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
ఆరెపల్లి గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసమే మేడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని ఆరేపల్లి గ్రామ సర్పంచ్ కర్రోల్ల దివ్య కృష్ణ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.శిబిరంలో సుమారు 80 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలను కూడా పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు.

వైద్య పరీక్షల్లో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు గుర్తించిన 16 మందిని వివిధ శస్త్ర చికిత్సల కోసం మేడిసిటీ హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఉచితంగా నిపుణుల వైద్య సేవలు అందించడంతో గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆరెపల్లి ఉపసర్పంచ్ వీరేశం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బాకి మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లాగౌడ్, వార్డు సభ్యులు కొమురయ్య, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -