- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో శనివారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జ్వరం, దురద, జలుబు సమస్యలతో, అనారోగ్యంతో విద్యార్థులను పరీక్షించి మందులు అందజేశారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జానకమ్మ, ప్రిన్సిపాల్ వనిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.
- Advertisement -