నవతెలంగాణ – కంఠేశ్వర్
యువరాజ్ సింగ్ జన్మదినం సందర్బంగా డిసెంబర్ 12వ తేదీన జన్నేపల్లి లోని శ్రీ మహేశ్వరి గార్డెన్స్ నందు క్యాన్సర్ స్క్రీనింగ్ కంటి పరీక్షలు ఆలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తునట్టు యూవి కెన్ యూవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దొడ్డి సృజన్ కుమార్ అన్నారు. బుధవారం కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నిరంతర సామజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటున్న యూవి కెన్ మరియు యూవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జన్నేపల్లి లో గల శ్రీ మహేశ్వరి గార్డెన్స్ నందు మాజీ క్రికట్ ప్లయర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా పలు సామజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
దానిలో క్యాన్సర్ స్క్రినిoగ్ బ్లడ్ డొనేషన్ కాంప్, కంటి పరీక్షలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బాగ్స్, నోటుబుక్స్, స్టేషనరీ పంపిని, ఆలాగే వివిధ రంగ్గాల్లో విశేష సేవలoదించిన పలువురికి సేవా భారతీ పేరిట అవార్డ్స్ అందచేయడం జరుగుతుందని యూవి ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సృజన్ తెలిపారు. సామజిక సేవ లో తమ సంస్థ ఎప్పడు ముంద్దె ఉంట్టుందని దానిలో భాగంగా డిసెంబర్ 12వ తేదీ మరిన్ని సేవ కార్యక్రమలను నిర్వహిస్తున్నమని వెల్లడించారు. ఈ శిబిరానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అభిమానులు పెద్ద ఎత్తున్న వొస్తున్నారని వివరించారు. వారితో పాటు తెలంగాణలో సామాజిక సేవ అందిస్తున్న సమాజసేవకులను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమనికి సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూవి ఫౌండేషన్ ప్రతినిధులు అనిల్,రాజేష్, రాకేష్, ప్రశాంత్, ఆకాష్, సన్నీ, నరేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.



