- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం భూక్య తండా, రాసిగుట్ట తండలో ఉమ్మడి మద్దిమల్ల గ్రామాల్లో మండల వైద్యాధికారిణి స్నేహ అధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేసి, మందులు పంపిణీ చేశారు. నీటి తొట్టిలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎం ఎల్ హెచ్ పీ బాల కృష్ణా, ఆకాష్ మాట్లాడుతూ గ్రామాల్లో 64 మందికి పరీక్షలు చేశామన్నారు . ఒక్కరికి జ్వరం వచ్చిన వ్యక్తిని సి హెచ్ సీ సెంటర్ కు పంపించమని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం కీర్తి, మంజుల, సుజాత, అమృత, ప్రవీణ, ఆశ వర్కర్లు ఉన్నారు.
- Advertisement -