- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం సైదాపురం గురువారం, ధన్వంతరి ఆలయంలో ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొనీ మాట్లాడుతూ ధన్వంతరి దేవుడు మా ఆరాధ్య దైవం అని అన్నారు. హైదరాబాద్ కి వచ్చి చూయించుకునే టైం దొరకక ఉన్న వారి కోసం ఈ మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్స్ భాస్కర్, వివేక్, అనిల్, ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు కాటూరి శ్రీనివాసచార్యులు, స్థానాచార్యులు భాస్కరాచార్యులు పూజారులు, డాక్టర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -