Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి ఆయా గ్రామాలలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని అయా గ్రామాలలో మెడికల్ అధికారి యేమిమా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని మెరుగైన చికిత్స కొరకు 108 అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి పంపించారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, పరిసర ప్రాంతాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. వేడి ఆహార పదార్థాలను తినాలని బయట ఆహార పదార్థాలు తిన వద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -