– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య
– శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్
– శిబిరంలో 150మందికి వైద్య పరీక్షలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ నరసయ్య మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైద్య శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ వందరోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ వైద్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి ప్రియ, పిల్లల వైద్యులు డాక్టర్ శరత్, కంటి వైద్యులు డాక్టర్ సంకీర్తన, ఆర్థోపెడిక్ డాక్టర్ శుభం, డెంటల్ డాక్టర్ ప్రవీణ్, జనరల్ వైద్యులు డాక్టర్ మోసిన్ పాల్గొని వైద్య సేవలు అందించారు.
శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలున్న పలువురిని నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, నాగపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, ఆసుపత్రి వైద్యులు మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి, డాక్టర్ హసీనా, సిహెచ్ఓ రమణ, హెచ్ఈఓ మహేందర్, ఆకుల మారుతి, సూపర్వైజర్ బుచ్చమ్మ, శరత్, స్టాఫ్ నర్సులు దేవేందర్, అనిత, ల్యాబ్ టెక్నీషియన్ పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.



