Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి 

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

ఐటీడీఏ అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్  బాబు
నవతెలంగాణ – అచ్చంపేట

చెంచుల కోసం ఏర్పాటు చేస్తున్న వైద్య ఆరోగ్య శిబిరాలను చెంచులు  సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ అదనపు జిల్లా వైద్య  ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్. సురేష్ బాబు అన్నారు. సోమవారం అటవీ ప్రాంతంలోని  ఈర్లపెంట, పుల్లయ్యపల్లి  చెంచు పెంటలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. ఐటీడీఏ, జిల్లా వైద్య మరి ఆరోగ్యశాఖ సంయుక్తంగా  వైద్య శిబిరం నిర్వహించారు.

 రెండు ఆవాసాల శిబిరంలో 89 మందికి  క్షయ వ్యాధి కొరకు స్క్రీనింగ్ పరీక్షల నిర్వహించగా ముగ్గురికి  క్షయ వ్యాధి నిర్ధారణ వచ్చిందన్నారు. భవిష్య భారత్  మొబైల్ వాహనములో ఎక్స్రే- రే, రక్త పరీక్షలు నిర్వహించారు. షుగర్, బిపి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యాధులను సులభంగా తగ్గించవచ్చునని సూచించారు.

ముఖ్యంగా గర్భవతులు పౌష్టికాహారం పై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రతిరోజు ఆకుకూరలు తమ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా గర్భవతులలో రక్తహీనతను అరికట్టడం ద్వారా సురక్షిత మాతృత్వం పొంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఐటీడీఏ డాక్టర్ కళ్యాణ్,  అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బికులాల్, హెల్త్ పీఎం జన్మన్ డాక్టర్ ప్రవీణ్, ల్యాబ్  టెక్నీ షియన్ ఆకాష్, స్టాఫ్ నర్స్ రాణి, ఆరోగ్య కార్యకర్తలు రాజేష్, పద్మ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -