Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఆస్పత్రికి వైద్య పరికరాలు అందజేత

తాడిచెర్ల ఆస్పత్రికి వైద్య పరికరాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాపురంలో ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సిఎస్ఆర్ నిధులతో రూ.2 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను ఏఎంఆర్ జనరల్ ఫిజీషియన్  శ్రీకాంత్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి వినయ్ భాస్కర్ కు అందజేశారు. పరికరాల్లో ఈసీజీ మిషన్, ఫ్రిడ్జ్, నెబ్లైజర్, కంప్యూటర్, ప్రింటర్,  వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సి బిపి కెమికల్స్, ఎక్స్రేరే ఫిలిమ్స్, ఎక్స్రేరే కెమికల్స్ తదితరవి అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ డిజిఎం రమేష్ బాబు,సిఎస్ఆర్ సూపర్ వైజర్ బొబ్బిలి నరేష్,హెచ్ ఆర్ అడ్మిన్ ప్రశాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -