- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా వైద్య బృందం జనరల్ సర్జన్ డా.సాయికుమార్, మెడికల్ ఆఫీసర్స్ డా.రవి,డా.దీప్తి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్షించి,విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి.కుమారస్వామి, ఉపాధ్యాయులు, జయభాస్కర్, పూర్ణచందర్, ఎల్ జగన్ నాయక్, శివలింగం, వెంకటేశ్వర్లు, రాజేందర్, శ్రీనివాస్ శివరాణి, వినోద్ కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.
- Advertisement -



