బాలికల ఉన్నత పాఠశాలలో కంటి శిబిరం
కస్తూర్బా విద్యార్థులకు రక్త పరీక్షలు
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం అందత్వ నివారణ సంస్థ, ఆర్.బి ఎస్.కె సదాశివ నగర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని, కస్తూర్బా గురుకుల పాఠశాలలో బాలికలకు రక్త పరీక్షను పిహెచ్సి వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 234 మంది విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి, 11 మందికి కంటి అద్దాలు అందజేసి, ఇద్దరు విద్యార్థులకు సరోజిని నాయుడు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రిఫర్ చేసినట్టు తెలిపారు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్త పరీక్షలకు నమూనాలు సేకరించినట్లు వైద్యులు సురేష్ తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆనందరావు, వైద్య బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బడి పిల్లలకు వైద్య పరీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



