తరుణ వ్యాధులు నివారణకు చర్యలు చేపట్టామని ప్రకటన
నవతెలంగాణ – అశ్వారావుపేట : మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని మారుమూల మలేరియా ప్రభావిత గ్రామాలైన మొద్దులు మడ, దురద పాడు లను అశ్వారావుపేట (వినాయకపురం) ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాందాస్ సోమవారం సందర్శించారు. ఆరోగ్యం శిభిరం నిర్వహించి తరుణ వ్యాధులకు మందులు పంపిణీ చేసారు. దోమలు నివారణ కు పెరిత్రం మందును గృహాలలో పిచికారీ చేయించారు.
స్థానికులకు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు వీధుల వెంట గుంతల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, రోజూ సాయంత్రం దోమలు నివారణకు ఫాగింగ్ చేయాలని స్థానిక పంచాయితీ సిబ్బంది సూచించారు. దమ్మపేట మాత శిశు సంరక్షణ బృందం ఈ గ్రామాల గర్భిణీ స్త్రీలకు, పిల్లల తల్లులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డీపీఎంఓ మోహన్, ఎంటీఎస్ విజయ్ రెడ్డి, హెచ్.ఏ సత్యనారాయణ, ఏఎన్ఎం చెల్లెమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.