నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రజలకు అందుబాటులోనే వైద్య సేవలు అందుతున్నాయని సర్పంచ్ మోర నిర్మల అన్నారు. మండలంలోని పద్మ నగర్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సంపూర్ణ సురక్ష కేంద్ర జిల్లా ఆసుపత్రి సహకారంతో తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామంలో ఉన్న దాదాపు 100కు పైగా గ్రామస్తులకు బీపీ, షుగరు, హెచ్ఐవి, సిఫిలిస్ హెపటైటిస్ బి, సి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకే హెల్త్ క్యాంపులను గ్రామాల్లో ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ప్రజలందరూ ఇలాంటి క్యాంపులను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ ను మెడికల్ ఆఫీసర్, ఐ సి టి సి కౌన్సిలర్ గంగాధర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్, పద్మ నగర్ ఏ ఎన్ ఎం జ్యోతి, సంపూర్ణ సురక్ష కేంద్ర మేనేజర్ సుష్మా, ఓ ఆర్ డబ్ల్యు లు రమ, అభిరామ్ ,ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



