కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలంలో వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు,సిబ్బంది సమయ పాలన పాటించాలని లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల కొరత లేకుండా చూడాలన్నారు.అనంతరం రోజువారీ రికార్డులు తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో గైహాజరైన సిబ్బందిపై చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఆసుపత్రి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం నేడు శనివారం మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్న నేపథ్యంలో పలు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్,వైద్యాధికారి వినయ్ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES