Monday, February 23, 2026
E-PAPER
Homeక్రైమ్వైద్య విద్యార్థిని ఆత్మహత్య

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

– సిద్దిపేట సురభి మెడికల్‌ కాలేజ్‌లో ఘటన
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌

ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలంలోని సురభి మెడికల్‌ కళాశాలలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా శ్రీరామ్‌పూర్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీజ(20)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామలే ముందుండి సురభి మెడికల్‌ కళాశాలలో చేర్పించారు. ఈ క్రమంలో ఆదివారం తోటి విద్యార్థులతో కలిసి టిఫిన్‌కు వెళ్లాల్సిన శ్రీజ.. ‘వస్తాను.. మీరు వెళ్ళండి’ అంటూ స్నేహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే స్నేహితులు టిఫిన్‌ చేసి వెళ్లి చూసేసరికి రూమ్‌లో శ్రీజ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలపగా వారు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీధర్‌ అనే యువకుడితో పరిచయం పెంచుకోవడంతో సంబంధిత యువకుడు పెండ్లి చేసుకోవాలంటూ విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. శ్రీజ వాళ్ల మేనమామకు కూడా ఫోన్‌ చేసి ‘మీ కోడలిని పెండ్లి చేసుకుంటా.. అని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -