Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజ్జల్ వాడి విద్యార్థులకు వైద్య పరీక్షలు..

బిజ్జల్ వాడి విద్యార్థులకు వైద్య పరీక్షలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన బిజ్జల్ వాడి మండల పరిషత్ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు జుక్కల్ 30 పడకల ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ విట్టల్ ఆదేశాలనుసారం వైద్య సిబ్బంది మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ. రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి న వైద్య బృందం వైద్యంపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై ధ్యాస ఉంటుందని, అందువలనని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని హెచ్ ఎం రవికుమార్ అన్నారు. అంతకుముందు ప్రతి విద్యార్థికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలున్న వారికి ఉచితంగా మందులు , టానిక్ వైద్య బృందం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాగ్మారే గంగాబాయి, జిపి కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు , వైద్య సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -