ఎంపీడీవో వేణుమాధవ్, ఎంఈవో శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర
ఔషధ మొక్కలు మానవ మనుగడకు ఎంతో మేలు చేస్తాయని ఎంపీడీవో వేణుమాధవ్, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, సీజీఆర్ ప్రతినిధి అన్నమయ్య అన్నారు. హైదరాబాద్ కు చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి దంపతులు 100 ఔషధ మొక్కలను అందజేయగా, వాటిని మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాటి, ఔషధ మొక్కల ఉద్యాన వనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఔషధ మొక్కలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. కాలుష్యం పెరుగుతున్న తరుణంలో ఔషధ మొక్కలను పెంచి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని సూచించారు. ఔషధ మొక్కల పెంపకం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి వెంకటేష్, సీజీఆర్ కోఆర్డినేటర్ జీవన్, ఎర్త్ క్లబ్ ఇంచార్జ్ శ్రీధర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఔషధ మొక్కలు మానవ మనుగడకు మేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES