Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ ప్రెస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి 

డాక్టర్ ప్రెస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి 

- Advertisement -

నిజామాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

డాక్టర్ ప్రెస్క్రిప్షన్ తో మాత్రమే మందులను ఇవ్వాలని మెడికల్ నిర్వాహకులకు నిజామాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ కంపెనీలు, వివిధ బ్రాండ్లు పొంది అనుమతి ఉన్న మందులు మాత్రమే ఉన్నాయని నవ తెలంగాణతో తెలిపారు. ప్రభావితం చేసే బ్యాచ్ మందులు జిల్లాలో ఎక్కడ లేవని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాము. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు నాణ్యత గల మందులు ఉన్నాయా లేదా అనేది తనిఖీలు చేస్తూ, నాణ్యత లేని మందులు ఉంటే తక్షణమే చర్యలు సైతం తీసుకుంటున్నామన్నారు. ప్రభావిత బ్యాచ్ యొక్క ఏవైనా స్టాక్ లను ఇప్పటివరకు అలాంటివి జిల్లాలో గుర్తించలేమన్నారు. అనుమతి పొందిన బ్యాచ్ లను మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. ప్రజా భద్రత కోసం తమ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవేళ నిజామాబాద్ జిల్లాలో ప్రభావితం చేసే బ్యాచ్ మందులు ఉంటే సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -