రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం
నేడు సికింద్రాబాద్‌లో కొత్త ఆసుపత్రి ప్రారంభం : సీఎండీ అనిల్ కృష్ణ వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్
వచ్చే ఏడాది తమ సంస్థను ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు తెచ్చే యోచనలో ఉన్నామని మెడికవర్ హాస్పిటల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అనిల్ కృష్ణ వెల్లడించారు. సంస్థ వ్యాల్యూయేషన్ ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8800) ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. సంస్థ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. ప్రస్తుతం తమకు 23 హాస్పిటల్స్ ఉన్నాయని.. మంగళవారం సికింద్రాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడం ద్వారా 24కు చేరనున్నాయని వెల్లడించారు. దీన్ని 100 కోట్ల పెట్టుబడితో.. 300 పడకలతో అందుబాలోకి తెచ్చామన్నారు. దీంతో మొత్తం పడకలు 5800కి చేరనున్నాయని చెప్పారు. త్వరలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కోకాపేటలో మరో హాస్పిటల్ అందుబాటులోకి రానుందన్నారు.
తమ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కార్యకలాపాలను కలిగి ఉందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1850 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం 2025-26లో రూ.2,000 కోట్ల మేర సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 6300 బెడ్లకు విస్తరించనున్నామని చెప్పారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో రూ.150 కోట్లతో తెస్తోన్న హాస్పిటల్‌లో 500 పడకల సామర్థ్యంతో రానుందన్నారు. దీంతో 25 ఆసుపత్రులకు చేరనున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ప్రస్తుతం తాము కార్యకలాపాలు కలిగిన ఉన్న ప్రధాన నగరాలు సహా ద్వితీయ శ్రేణీ నగరాల్లో మరొన్ని కొత్త హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
పబ్లిక్ ఇష్యూ యోచనలో మెడికవర్ హాస్పిటల్
- Advertisement -
- Advertisement -