Friday, March 13, 2026
E-PAPER
Homeబీజినెస్ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో మెడికవర్‌ భాగస్వామ్యం

ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో మెడికవర్‌ భాగస్వామ్యం

- Advertisement -

అందుబాటులోకి ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు
హైదరాబాద్‌ :
ప్రయివేటు రంగ వైద్య సేవల సంస్థ మెడికవర్‌ హాస్పిటల్స్‌ తాజాగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కోకపేటలోని తన శాఖలో ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలతో అత్యవసర వైద్యాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.
ఇందుకోసం తన అధికారిక ప్రారంభానికి ముందే అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు, అంతరాష్ట్ర క్రిటికల్‌ కేర్‌ ట్రాన్స్‌ఫర్లు, అంతర్జాతీయ రోగుల రవాణా వంటి కీలక సేవలను ఆసుపత్రి తొలి రోజు నుంచే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ హెడ్‌ డాక్టర్‌ నయన్‌ శ్రీరాముల తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదని, అందుకే సంఘటనా స్థలం నుంచే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేలా ఈ సమగ్ర నెట్‌వర్క్‌ను రూపొం దించామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన అన్ని వేళల అత్యవసర సేవలను అందిస్తూ రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించనుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -