Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివాసి నాయక పోడు సభ్యుల సమావేశం 

ఆదివాసి నాయక పోడు సభ్యుల సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పట్టణ పరిధి పెర్కిట్  శివారులో భీమన్న గుడి వద్ద జిల్లా ఆదివాసి నాయకపోడు కార్యవర్గ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, గాండ్ల రాంచందర్, అధ్యక్షుడు బండారి భోజన్నలు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మా ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు సంఘ భవనం లేనందున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు గౌరవ బోధన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి నీ త్వరలో కలిసి సంఘభవనానికి స్థలము , నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేయాలని, గ్రామస్థాయి నుండి మండల స్థాయి ఆదివాసి నాయకపోడ్ కులస్తులందరినీ బలోపేతం చేసి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను జిల్లా ఆదివాసి నాయకపోడ్ పేద కులస్తులకు అందే జిల్లాలో కులస్తులు ఉద్యోగస్తులు సర్పంచులు ప్రజాప్రతితులు కృషి చేయాలని, పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో నిజాంబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడ్ కులస్తులతో మహాసభ సుమారు 20 వెయ్యిల మందితో ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఇ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శివ శంకర్ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొసెడుగూ మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -