నవతెలంగాణ – కంఠేశ్వర్: 18న జరిగే చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి కుడాల స్వామి మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని, ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆర్ఎంపీ అతిపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ జరిగే సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు రూ.2000 నుంచి రూ.4000, వికలాంగుల పెన్షన్లు రూ.4000 నుంచి రూ.6000, కండరాల క్షీణించిన వారికి రూ.15000 పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దగ్గరికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని అన్నారు.
ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఈ నెల 18న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని సామాజిక పెన్షన్ దారుల, వికలాంగుల, బీడీ కార్మికుల పెన్షన్ దారుల సమావేశం నిజామాబాద్ టౌన్ లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లా నలువైపుల నుంచి పెన్షన్ దారుల వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున, విహెచ్పిఎస్ మహిళా అధ్యక్షులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.