నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలో మాలమహానాడు మండల అధ్యక్షులు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లోని శ్రీరామ గార్డెన్‌లో ఈ నెల 12వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్లలో మాల వర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్ హాజరుకానున్నారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో మాలలకు జరిగిన అన్యాయం, రోస్టర్ పాయింట్లలో అనుసరించాల్సిన న్యాయ విధానం పై అవగాహన కల్పించడమే ఈ మీటింగ్ ఉద్దేశమని చెప్పారు. అదే విధంగా గ్రూప్–1లో ఉద్యోగాలు సాధించిన మాల వర్గానికి చెందిన అభ్యర్థులను సన్మానించనున్నట్లు క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానాడు జాయింట్ సెక్రటరీ పెండ ఉదయ్, ఆలూర్ సెక్రటరీ చిట్టీ బాబు, కోశాధికారి పిట్ల శోభన్,శ్రీనివాస్, గంగాధర్, సజన్, మహిపాల్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలూర్‌లో మాలమహానాడు ఆధ్వర్యంలో సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES