నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఛైర్మన్ సౌజన్య సమక్షంలో రైతులు, హమాలీలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట అమ్మకం సమయంలో హమాలీలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టికి తీసుకుని వచ్చారు. పంట అమ్మకానికి తీసుకుని వచ్చినప్పుడు తూకం తర్వాత మాత్ర ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఎమ్. రాజ్ కుమార్ రైతులతో మాట్లాడుతూ.. మాత్ర తీసువడం నిబంధనలకు విరుద్ధం అని తెలిపారు. ఒకవేళ తీసుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. నాఫేడ్ నిబంధనల ప్రకారం రైతుల వద్ద కొలత డబ్బులు తీసుకోవాలని సూచించారు. అలాగే దడవాయి నియమించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సూపర్ వైజర్ రాం చందర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, రైతులు, హమాలీలు, అడత్ వ్యాపారులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలతో సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



