Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుహాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాల్లో మెగా రక్తదాన శిబిరం

హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాల్లో మెగా రక్తదాన శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయా గ్రామాల భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. రెండు గ్రామాల్లో కలిపి సుమారుగా 100 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణదానం చేయడంతో సమానం అన్నారు.

ప్రస్తుతం మనం ఇచ్చిన రక్తం ఆపదలో ఉన్న ఎంతోమందికి ప్రాణాన్ని అందిస్తుందన్నారు. తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రక్తదానంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చిన వారికి పండ్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ  మండల ప్రధాన కార్యదర్శులు సోమ నరేష్, సున్నం మోహన్, మండల ఉపాధ్యక్షులు సతీష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కొత్తపల్లి గణేష్, నాయకులు కొమ్ముల సంతోష్, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -