– సామాజిక సేవతో మహనీయులను స్మరించుకుందాం
– 200 ల మంది రక్తదాలకు హెల్మెట్ లు అందజేస్తాం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త సహకారంతో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 వ తేదీ మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. మహనీయుల జయంతులు స్ఫూర్తిదాయకంగా సామాజిక సేవలో భాగస్వాములుగా నిలవాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి అంబేద్కర్ కు నివాళులు అర్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లా పిలుపునిచ్చిందనీ రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్త దాన కార్యక్రమ కోఆర్డినేటర్ బాలు, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి సంగయ్య, కోశాధికారి శ్రీనివాస్, కామారెడ్డి మండల అధ్యక్ష కార్య దర్శులు రాజయ్య, వంశీ, బిచ్కుంద మండల అధ్యక్షులు ఎంకొల్ల రాజన్న, సాయి మౌర్య డి. రాజయ్య, మన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



