500 ఎకరాలకు మొక్కలు అందజేత
ఆయిల్ ఫాం సాగుతో అదనపు నికరాదాయం
జిల్లా ఉద్యాన, ఆయిల్ ఫెడ్ అధికారులు కిషోర్, రాధాక్రిష్ణ లు….
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఉద్యాన – పట్టుపరిశ్రమ శాఖ, టి.జి ఆయిల్ ఫెడ్ లు సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు పై రైతులకు గురువారం మెగా డ్రైవ్ నిర్వహించారు. జిల్లా లో 12 మండలాల్లో 125 మంది రైతులకు 503.14 ఎకరాలు కు సరిపడా మొక్కలను అందించారు. ఈ సందర్భంగా డీఎస్హెచ్ఓ జంగా కిషోర్,ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జి నాయుడు రాధాక్రిష్ణ లు రైతులు ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు,లాభాలు,ప్రభుత్వ రాయితీలు మొదలైన అంశములు రైతులకు వివరించారు.
ఆయిల్ పామ్ తోటలు ఒకసారి వేసుకుంటే 4 వ సంవత్సరము నుండి గెలలు దిగుబడి మరియు ఆదాయం మొదలై 35 సంవత్సరాల వరకు గెలలు దిగుబడి తో స్థిరమైన ఆదాయం పొందవచ్చును అన్నారు. ఆయిల్ పామ్ తోటలో 3 సంవత్సరాల వరకు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చును. 4 సంవత్సరాల వరకు పంట యాజమాన్యం,నిర్వహణ, అంతర పంటల సాగుకు గాను ఎకరానికి రూ. 4200 ల చొప్పున ప్రభుత్వం రాయితీ అంద జేయబడుతుందని తెలిపారు. ఈ ఆయిల్ పామ్ పంటకు కోతులు,దొంగలు బెడద ఉండదని,దళారీ వ్యవస్థ దగా ఉండదని,రైతు పండించిన గెలలు కు ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ సదుపాయం కలదు ఉండదన్నారు. రైతుకు రూ.1,00,000 లు నుండి రూ.1,50,000 లు వరకు ఎకరానికి స్థిరమైన ఆదాయం వచ్చను అన్నారు.
మొక్క జొన్న పంట ఆశించే కత్తెర పురుగు మరియు పత్తి పంట ఆశించే గులాబీ రంగు పురుగుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున మొక్క జొన్న మరియు పత్తి చేపట్టే అందరూ ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.17000 లు నుండి రూ.21,000 లో వరకు ఉన్నది అని కావున నీటి వసతి గల ప్రతి ఒక్క రైతు ఆయిల్ పామ్ సాగు చేయడానికి మొగ్గు చూపాలి అన్నారు.నిర్వహణ,యాజమాన్యం,ఎరువులు, కూలీ ఖర్చులు చాలా తక్కువ,ఒక ఎకరానికి 8 నుండి 10 టన్నులు దిగుబడి వస్తుంది అని తెలిపారు.బ్యాంకులు కూడా పంట పై లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయని,ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు కూడా ఈ జిల్లాలోనే రెండు ఉన్నాయి అని,10 ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉన్నట్లైతే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి తో సమానంగా ఆదాయం పొందవచ్చు అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి అని ఫీల్డ్ ఆఫీసర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అని తెలిపారు.