డ్రైవర్లకు ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేసిన ఎస్పీ
నవతెలంగాణ – ముధోల్
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నిర్మల్ పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న “అరైవ్ అలైవ్–2026” కార్యక్రమం రెండో దశలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లో మెగా ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ను శుక్రవారం ముధోల్ పోలీస్టేషన్ లో ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరానికి అనుహ్య స్పందన లభించింది .డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో స్థానిక భోస్లే గోపాల్ రావు కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
చూపు సమస్యలు ఉన్న డ్రైవర్లను గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ దూరదృష్టి లోపం, చూపు మందగించడం వంటి సమస్యల తో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని తెలిపారు. డ్రైవర్లు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని, సూచించారు .సరైన చూపు సురక్షిత డ్రైవింగ్‌కు ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే ప్రమాదాలను గణనీయంగాతగ్గించవచ్చనిఅభిప్రాయపడ్డారు.డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాలపై అవగాహన కల్పించారు.
అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సంవత్సరం లో రెండుసార్లు వైధ్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు నిర్మల్ పోలీస్ మీ పోలీస్” అని అన్నారు.ఈ శిబిరం కు ముధోల్ సర్కిల్ పరిధిలో ని ఆటో డ్రైవర్ లు, ఏవి డ్రైవర్ లు హాజరయ్యారు. సుమారు 200మంది కి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా , ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐలు,బిట్ల పెర్సెస్, అశోక్,ఎస్ కె జుబేర్, ముధోల్ సర్పంచ్ శబనాభేగంఎజాజోద్దిన్,కంటిటివైద్యులుడా.శ్వేత,డా.అనిరోధ్, సందీప్, శ్రీకాంత్, సాయన్న,పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, పాల్గొన్నారు.


