Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొల్లేపల్లి పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్..

బొల్లేపల్లి పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్పెషలిస్ట్ డాక్టర్లచే మెగా క్యాంప్ నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి తెలిపారు. ఇందులో భాగంగా కంటి, ముక్కు చెవి గొంతు, చర్మవ్యాధి మరియు మానసిక వైద్యులచే పరీక్షలు చేయించి ఉచిత మందులను అందించారు. బొల్లెపల్లి ఆరోగ్య కేంద్రంలో 135 మందికి స్త్రీలను చెక్అప్ చేసి 110 మంది స్త్రీలకు పరీక్షలు చేసి వారికి మందులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ వాసు దేవానంద్, ముక్కు, చెవి, గొంతు డాక్టర్ సౌజన్య, సైకియాట్రిస్ట్ డాక్టర్ సాగరిక, డాక్టర్ కౌశిక్, డెర్మటాలజిస్ట్ డాక్టర్లు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -