Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పానీపూర సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్..

పానీపూర సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్..

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ జిల్లా డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్య శ్రీ అన్నారు. సోమవారం వైద్య విధాన పరిషత్ పానీపూర సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రభుత్వం స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ మహిళల ఆరోగ్య శిబిరంలో మహిళలకు  స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళల కు రక్తపోటు, మధుమేహం సహా ఓరల్, సర్వెకల్, బ్రెస్ట్ క్యాన్సర్లు, తదితర వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 

 గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు, నేత్ర నిపుణులు, ఈఎన్టీ వైద్యులు, దంత వైద్యులు, డెర్మటాలజిస్టలు, మానసిక వైద్యులు తదితరులను మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ స్త్రీలకు పూర్తి వైద్య పరీక్షలు (ఏఎన్సీ), హీమోగ్లోబిన్ పరీక్షలు, గర్భధారణ సమయంలో పోషకాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు ఈ వైద్య శిబిరంలో 323 మందికి  వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు.

ఇందులో క్షయ, నేత్ర సమస్యలతో బాధపడే వారికి ఉస్మానియా సరోజినీ హాస్పిటల్ కు రిఫర్ చేశామన్నారు. కార్పొరేటర్ స్వామి యాదవ్, పానీపూర సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ బి.వి. రామకృష్ణ, డాక్టర్ నజియా నౌషిన్ సిద్ధిఖా, డాక్టర్ రాహుల్, డాక్టర్ నిఖత్, డాక్టర్ తన్వీర్ ఫాతిమా, డాక్టర్ మనోజ్ఞ, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ లు పరిమళ, శ్యామల,  ఫార్మసిస్ట్ అరుణ్ యువరాజ్ గౌడ్ ,జి శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -