Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: తాడిచెర్ల, కాపురం గ్రామాల భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేశారపు రవి ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం ద్వారా మంగళవారం తాడిచెర్ల పాత జీపీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విశేష స్పందన లభించింది. డేంజర్ జోన్లో నివసిస్తున్న గ్రామస్తులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఈ శిబిరంలో 150 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దీక్షిత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ… కేసరపు రవి పిలుపు మేరకు గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన‌ట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -