నవతెలంగాణ – గాంధారి
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గాంధారి మండలంలోని లొంక తండా చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మోహన్ నాయక్ ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా నూతనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితుడైన మెగావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఆలే మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు బాధ్యత అప్పగించిన పెద్దలందరివి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మోహన్ నాయక్ అన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మెగావత్ మోహన్ నాయక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



