Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ కళాశాలలో మెహందీ సెలబ్రేషన్స్

జూనియర్ కళాశాలలో మెహందీ సెలబ్రేషన్స్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం మెహందీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినిలు గోరింటాకుతో చేతులపై రకరకాల డిజైన్లతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆషాఢమాస ప్రాముఖ్యతను  తెలియజేయాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కళాశాలలో మెహందీ వేడుకలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, అధ్యాపకులు మధు కుమార్, రాజ్ కుమార్, వైష్ణవి, సుమతి, గంగాధర్, మహేందర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -