Thursday, January 8, 2026
E-PAPER
Homeసినిమా'టాక్సిక్‌..'లో మెల్లిసాగా..

‘టాక్సిక్‌..’లో మెల్లిసాగా..

- Advertisement -

యష్‌ నటిస్తున్న నూతన చిత్రం ‘టాక్సిక్‌ : ఏ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’. తాజాగా ఈ భారీయాక్షన్‌ డ్రామా చిత్రం నుంచి రుక్మిణి వసంత్‌ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ మంగళవారం రిలీజ్‌ చేశారు. అందం, అధికారంతో ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే రీతిలో ఈ పాత్ర ఉందని పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది.
యష్‌, గీతూ మోహన్‌దాస్‌ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు యష్‌తో కలిసి రుక్మిణి వసంత్‌ నటించడంతో ఇది ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తోంది. డైరెక్టర్‌ గీతు కథలో చెప్పాలనుకున్న డెప్త్‌, సీరియస్‌నెస్‌ అర్థం చేసుకుని తనదైన నటనతో భావోద్వేగాలను అద్భుతంగా పలికించేలా సహజంగా ఒదిగిపోయే నటి రుక్మిణి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోయేలా ఓ ఇండియన్‌ సినిమా చేయాలనే యష్‌ ఆశయం కూడా ఇందులో ప్రతిబింబిస్తుంది.
డైరెక్టర్‌ గీతూ మోహన్‌దాస్‌ మాట్లాడుతూ,’రుక్మిణిలో నాకు నచ్చే విషయం ఏమిటింటే, నటిగా డైరెక్టర్‌ చెప్పింది చేస్తే చాలు అని ఆలోచించే వ్యక్తి కాదు. చాలా తెలివైనది. పాత్రను అర్థం చేసుకుంటుంది. పాత్ర గురించి ఆమె వేసే ప్రశ్నలుచాలా ఆసక్తిని కలిగిస్తాయి. డైరెక్టర్‌గా అవి నన్నెంతో ఆలోచింపజేస్తాయి. కొన్ని సందర్భాల్లో నా నిర్ణయాలను ప్రశ్నించుకునేలా చేస్తాయి’ అని తెలిపారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ నిర్మిస్తున్న ఈచిత్రం ఇంగ్లీష్‌, కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో
మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -