– విద్యార్ధులకు ఎంఆర్పీ రాము సూచన
నవతెలంగాణ – అశ్వారావుపేట
తరుచూ చదవడం, రాయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని విద్యాశాఖ మండల రిసోర్స్ పర్సన్ రాము అన్నారు. ఆయన ఎఫ్ఎల్ఎస్(ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ ) పై అశ్వారావుపేట లోని నెహ్రూ నగర్ ఎంపీపీ ఎస్ లో సమీక్షించారు. ప్రధానోపాద్యాయురాలు బేబీ పద్మ పిల్లల పఠనా సామర్ధ్యాలను ఎంఆర్పీ సమక్షంలో పరీక్షించారు. సంతృప్తి చెందిన ఆయన నవతెలంగాణ తో జాతీయ విద్యా పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎస్ పై ఫిబ్రవరి 26 న పరీక్ష నిర్వహిస్తారని, అంతకంటే ముందు పాఠశాల స్థాయిలో మాక్ టెస్ట్, ఐటెం బ్యాంక్, యాక్షన్ ప్లాన్ నిర్వహించాల్సి ఉంటుందని వాటి పరిశీలన నిమిత్తం పాఠశాలలు సందర్శించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు పాల్గొన్నారు.
తరుచూ చదవడంతోనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


