Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్యాలయంలో చిందులేసిన 13 మందికి మెమోల జారీ  

మున్సిపల్ కార్యాలయంలో చిందులేసిన 13 మందికి మెమోల జారీ  

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ సుంచు నాగేందర్ 
నవతెలంగాణ – చేర్యాల

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ అనంతరం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేనేజర్ జె.ప్రభాకర్, పలువురు వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి చిందులు వేసిన విషయమై సంబంధిత అధికారులు స్పందించి చర్యలకు పూనుకున్నారు. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో కమిషనర్ సోమవారం కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయ ఆవరణలో డ్యాన్స్ చేసిన మేనేజర్ ప్రభాకర్, వార్డుఆఫీసర్లు, తాత్కాలిక సిబ్బందితో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న ఉద్యోగులు మొత్తం 13 మందికి మెమోలు జారీచేసినట్లు తెలిపారు. మంగళవారం లోగా ఇచ్చిన సంజాయిషీ మేరకు మున్సిపల్ శాఖ ఆర్డీతో పాటు జిల్లాకలెక్టర్ కు  నివేదిక అందజేస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -