Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానసిక సమస్యలు సిగ్గుపడదగ్గవి కావు..

మానసిక సమస్యలు సిగ్గుపడదగ్గవి కావు..

- Advertisement -

ఇవి కూడా శారీరక వ్యాధుల మాదిరిగానే చికిత్స పొందగలవు
డా. కేశవులు భాష వత్తిని. ఎండి, సీనియర్ మానసిక వైద్య నిపుణులు
నవతెలంగాణ- కంఠేశ్వర్ 

సహాయం కోరడం బలహీనత కాదు — అది ధైర్యం.ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారి భావోద్వేగ స్థితిని గమనించాలి.  చిన్నచిన్న మార్పులు, నిద్రలేమి, ఆసక్తి కోల్పోవడం, చిరాకు,ఒంటరితనం,ఇవి హెచ్చరిక సంకేతాలు కావచ్చు.మనసు బాగుంటే జీవితం అందంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజు మన మనసును కూడా చూసుకోవాలి.

మానసిక ఆరోగ్యం అన్నది కేవలం మానసిక వ్యాధుల లేమి కాదు; అది మన జీవితం మీద మనసుతో చేసే ప్రేమ. ఈ రోజు మనందరం ఒక నిమిషం మనసు వైపు చూడండి.మనకు బాగోలేకపోతే సహాయం కోరండి. ఇతరులు బాగోలేనట్టు కనిపిస్తే వారిని వినండి. అదే నిజమైన మానవత్వం – అదే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం స్ఫూర్తి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -