క్రికెట్ ఫైనల్ లో నసురుల్లాబాద్ టీమ్ విజేత
నవతెలంగాణ – నసురుల్లాబాద్
క్రీడలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుందని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ శంకర్ నాయక్, ఎస్ఐ రాఘవేంద్ర అన్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని సుందరయ్య గ్రౌండ్ లో గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గత 11 రోజుల క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుండగా బుధవారం ఎన్ పిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో నసురుల్లాబాద్, బాన్సువాడ టీమ్ లు పాల్గొనగా నసురుల్లాబాద్ క్రికెట్ టీం గెలుపొందడంతో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో ఫైనల్లో గెలుపొందిన నసురుల్లాబాద్ టీంకు 22 వేలు, రెండవ స్థానంలో నిలిచిన టీంకు 15 వేలు రూపాయల నగదు పురస్కారం ను గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్ అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్, ఎస్ఐ రాఘవేంద్ర మాట్లాడుతూ.. యువత చెడు వ్య్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతీ ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలన్నారు. తద్వారా శారీరకంగా దృఢంగా ఉండటానికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం అందిస్తుందని ఇటీవలే సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు గుర్తుచేశారు. ఎన్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ సహకరించిన పలు దాతలకు టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందు పటేల్ , మాజీ సర్పంచ్ అరిగే సాయిలు, ఐనాల లింగం, దాతలు ఖలీల్, హైమద్, షేక్ మహెబూబ్ జర్నలిస్ట్,అన్వర్, నిర్వాహకులు దీపక్ గౌడ్, ఐనాల పవన్, మనీష్ గౌడ్, మహబూబ్, వాలింటర్స్ పరి అక్షిత్ గౌడ్, సోయబ్, షేక్ అయన్, ఎంపైరింగ్స్ మనోజ్, కపిల్, ఓంకార్, అయినల శివ తదితరులు పాల్గొన్నారు.



